దత్త పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, (మైసూరు, కర్ణాటక రాష్ట్రం, భారతదేశము) తమదయిన అపార కరుణతో సమస్త మానవాళికి వారి అనుగ్రహంగా ఆశీర్వదించి ప్రసాదించినదే ఈ శతశ్లోకి రామాయణం

Read More..

నేడు ప్రపంచంలో ఎటుచూసినా ఎక్కడ చూసినా అరాచకం, హింసలు తాండవమాడుతున్నాయి. ఫలితంగా ప్రకృతి ఉపద్రవాలు మానవాళిని ముంచెత్తుతున్నాయి. భధ్రత అన్నదే లేక అనిశ్చితమైన జీవితాలతో మానవులకు రక్షణ, శాంతి కొరవడుతున్నాయి. అల్లకల్లోలమైన జీవిత విధానానికి "సదా 'దివ్యత్వమే' రక్షణ, శాంతి" ఈయగలుగుతుంది.

Read More..


ధర్మ రక్షణ, శాంతి స్థాపనలే ధ్యేయంగా కలిగిన పరమపూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందుల వారు అందుకొరకై తాము ఎంచుకొన్న ఎన్నో మార్గముల ద్వారా నిత్యం తమ ప్రణాళికలను నిస్వార్ధంగా ఈ జనులకు అందించుటలో వారే సాక్షాత్ 'దత్తం' అయినారు.

నాద బ్రహ్మగా " తమ రాగరాగిణీ విద్య ద్వారా (విశ్వయాత్ర చేస్తూ) అనేక రకాల భౌతిక, మానసిక దీర్ఘకాలిక రోగాలు నయం అయ్యేలా "నాదధ్యాన కచేరీ"లు ఇస్తున్నారు. యోగ బ్రహ్మగా "క్రియా యోగా శిక్షణా తరగతులు" నిర్వహిస్తున్నారు. మూర్తీభవించిన కరుణా స్వరూపునిగా "బండరాళ్ళ కన్నా కఠినమైన హృదయాలను సైతం తమ ప్రేమ పూరిత జ్ఞానబోధనలతో" కరగిస్తూ --- అందరిలో కొలువై ఉన్న దివ్యత్వాన్ని వెలికితీస్తూ --- మానవ జన్మ సార్ధకం అయ్యేలా "జ్ఞాన జ్యోతులు" వెలిగిస్తున్నారు

Read More..