జై గురుదత్త !
కృతజ్ఞత అనేది ఓ దివ్య భావన. ఈ సృష్టిలో కృతజ్ఞత అనేది 'దివ్యత్వానికి' ప్రతీక. తాను పొందిన మేలుకి, తనకు జరిగిన మంచికి మనిషి వ్యక్తపరిచే ఓ ఉన్నతమయిన భావనే ఈ కృతజ్ఞత ... నిజాయితీగా మనం ఈ కృతజ్ఞతని పరులకు వ్యక్తపరచినప్పుడు మనం ఎంత హాయిగా ఉంటామో, అది మనకు అనుభవంతోనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ'కృతజ్ఞత' కు అంతటి శక్తి ఉన్నది... ముఖ్యంగా ఈ 'కృతజ్ఞత' అనేది 'సద్గురువు' కు తెలియచేస్తే అది మరింతగా మనలను 'మహాదివ్యానుగ్రహం' అనే శక్తిధారలతో తడుపుతుంది. ఆశీర్వాదపు జల్లులలో మనలను సూక్ష్మంగా ముంచెత్తుతుంది. 'కృతజ్ఞత' అను పదానికి 'పరిపూర్ణ సార్ధకత' ఏర్పడునది అప్పుడే. ఈ 'కృతజ్ఞత' అనేది ఎన్నడూ వాడని, నేల రాలని ఓ 'దివ్యపుష్పం' ...అది దాని సుగంధాలను 'అవని' అంతా వ్యాపింపచేస్తూనే ఉంటుంది.

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మనవాళి శ్రేయస్సు కొరకై, అవ్యాజ్యమయిన వారి కరుణ , ప్రేమలతో మనకు అందించిన ఈ 'శతశ్లోకి రామాయణం' 'హనుమ మంత్రం' అను ఈ రెండు 'అమృత గుళిక' లకు వాటిని శ్రవణ, దృశ్యం రూపములలో గ్రోలుతున్నప్పుడు మనం పొందే దివ్యాను భూతులకు తిరిగి ఏమి ఇవ్వగలవారము శ్రీ సద్గురుదేవులకు? కేవలము పవిత్రమైన హృదయంతో "కృతజ్ఞతలు" అనే "దివ్య పుష్పాలను" సమర్పించటం తప్ప. అలా మీలో ఎవరయినా మీ కృతజ్ఞతలను శ్రీ స్వామీజీ వారికి తెలియచేయాలనుకుంటే @ Contact page తెలియజేయగలరు ~ మీ వివరాలతో సహా.

శ్రీ గురుదత్త