మనం నిత్యం అనేక రకాల శుద్ధికొరకు ముఖ్యంగా దాహార్తిని తీర్చుకొనుట కొరకు,'నీటిని' వాడతాం. ఒకవేళ ఆ 'నీరు' చాలినంతగా లభించకపోతే ఆ నీటిని పొందుటకై ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాం, నానారకాలుగా తాపత్రయాలు పడి అయినా సరే దాన్ని పొందుతాం. ఎందుకంటే 'నీరు' మనకందరికీ నిత్య, సత్య 'అవసరం'. మనిషి భౌతిక జీవితానికి, స్థూలదేహానికి 'నీటి' తో ఎంతో అవినాభావ సంబంధమున్నది.

నిజానికి మనమంతా కనిపించే ఈ 'స్థూలదేహంలో' నివసిస్తున్న "ఆత్మస్వరూపులం" "చైతన్య స్రవంతులం". బాహ్యశుద్ధికి, దాహార్తికి 'నీరు', మరి " అంతర్ శుద్ధికి, దాని ఆర్తి తీరుటకు కావలసినది "జ్ఞానం" అనే అమృతం. ఈ అమృతపానము లేకుంటే మానవ మనుగడ సదా దుర్లభమే, దుఖః పూరితమే, చీకటి మయమే. మరి అటువంటి నరకప్రాయమైన జీవితం నుంచి 'ముక్తి' విడుదల పొందుటకు 'ఆత్మస్వరూపులయిన' మనం "నీటిని పొందుటకు శ్రద్ధ చూపినట్లుగానే అదే శ్రద్ధని 'జ్ఞానం పొందుటకు చూపుతున్నామా? కనీసం 'ప్రయత్నం' చేస్తున్నామా? ఒకవేళ చేస్తూ ఉన్నట్లయితే దానిలో 'సఫలీకృతులం' కాగలుగుతున్నామా అంటే అది అంతే తేలికగా సమాధానం చెప్పగలిగే విషయం కాదు

ఎందుకంటే

'గురుకృప' 'గురుబోధ' లేకున్న అది 'సాధ్యం' కాదు. ఈ 'సత్యం' తెలిసిన సద్గురువుగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 'సమస్తమానవాళి' శాంతితో జీవించుట కొరకై వారి "కరుణామృత ధారలను" మనపై 'శతశ్లోకి రామాయణం' అనే రూపంలో కురిపించారు, తమ దివ్య గళముతో స్వీయ స్వర రచనతో. 24000 వేల శ్లోకాలతో కూడినటువంటి శ్రీ వాల్మీకి రామాయణాన్ని పారాయణం చేయుటకు తీరికలేని, (ఒకవేళ తీరిక ఉన్నా ఓపిక, శ్రద్ధలు లేని) నేటి ఆధునిక జీవితంలో శ్రీస్వామీజీ వారు చేసిన ప్రయోగం (ఈ నవీన యుగంలో వాడుకలో గలిగిన విధానాల ద్వారా) దాన్ని అందించిన విధానం ~ అమోఘం, హృదయాంతరాలలో నిండి ఉన్న వారి 'దివ్యప్రేమ'కు నిలువెత్తు నిదర్శనం. వారి కంప్యూటర్ Messenger అయిన 'PuttugamVideos.com' ద్వారా వారు ఈ దృశ్యపూరిత 'శతశ్లోకి రామాయణాన్ని' అందించారు. వారు చేసిన ఈ వినూత్న ప్రయోగం ఆబాల గోపాలాన్ని సైతం ఆకర్షించటమే కాకుండా "జాతి, మత, కులాలకు" అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హృదయాలను సైతం మీటుతున్నది అనుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నాడు -> ఊరు, వాడా ~ రామాలయ నిర్మాణం - నేడు -> ఇంటింటా, ప్రపంచవ్యాప్తంగా "శతశ్లోకి రామాయణ పారాయణం ~ దృశ్య, శ్రవణ, మననముల ద్వారా" ...

ఒక దివ్య సంకల్పంతో శ్రీ స్వామీజీ వారు మనకు అందించిన ఈ "శతశ్లోకి రామాయణాన్ని" ప్రతి నిత్యమూ భక్తి, శ్రద్ధలతో విని, చూసి తరిద్దాం.దీనిని ఇతరులకు తెలియ చెప్తూ, ఓ "దివ్యమాధ్యమం" లా దీనిని వీలైనంతగా ప్రచారం చేస్తూ 'ధన్యత' చెందుదాం.

"సద్గురు దేవుని అనుసరించుట అనగా వారు చేసిన బోధనని
త్రికరణ శుద్ధిగా ఆచరించుటయే, ఆచరింపచేయుటయే
"

*ఈ శతశ్లోకి రామాయణ వీక్షణం, శ్రవణం, స్మరణం, మననం ~ దాని ప్రచారం సాటి మనుజులకు దాని వలన మీకు కలుగు సర్వవ్యాధి, భయ, బాధా, దుఖః నివారణం -సర్వ కష్ట, నష్ట, పీడా నివారణం అది ఇచ్చు సర్వత్రా విజయం ~ శాంతి సౌభాగ్యాల ఆనందం *

"గురుభోధని అమిత భక్తి శ్రద్ధలతో ఆచరించుట వలననే మనకి కలుగు సచ్చిదానందం"

హే రామ్  

శ్రీ రామ్