జై గురుదత్త !
మానవుని జీవితంలో ప్రతీదీ ఓ అనుభవమే ~ "అనుభవాల సారమే మానవ జీవితం" ఈ అనుభవాలు ఎన్నో రకాలు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే అనుభవాలు రెండు రకాలు ... 1) ప్రాపంచికమైనవి 2) ఆధ్యాత్మికమైనవి .. ఈ ప్రాపంచికమైన అనుభవాలు ఎన్నో రూపాలలో మానవుని జీవితంలో జరుగుతాయి, వాటిని ఎవరయినా ఎక్కడయినా ఏ బేధభావనలతో సంబంధంలేకుండా అనుభవించటం జరుగుతుంది. కానీ 'ఆధ్యాత్మికమైన అనుభవాలని' కేవలము 'గురువు' ఒక్కడే ఈయగలడు ఈ సృష్టిలో.

ప్రాపంచిక అనుభవాల నుంచి మనిషి మారటం, అతని జీవితం 'సంపూర్ణంగా సార్ధకమవటం' అనేది మనిషి యొక్క యుక్తా యుక్త, విచక్షణా జ్ఞానాలపై ఆధారపడి ఉంటుంది. కానీ 'ఆధ్యాత్మిక అనుభవం' అనేది అలా కాదు. కొండపై ఉన్న దేవుని చేరాలంటే, దర్శించాలంటే 'మెట్లు' ఎలా అవసరమో అలా "నీలోనే ఉన్న దైవాన్ని ,- దివ్యత్వాన్ని" తెలుసుకోవాలన్నా, అనుభూతి చెందాలన్నా, "ఉన్నది అంతానీలోనే" అన్న 'సత్యదర్శనం' పొందాలన్నా, "జీవుడే-దేవుడు" అన్న 'ఆత్మసాక్షాత్కారం' కలగాలన్నా ~ "గురువు ~ గురువే" శరణం. గురువు బోధలే ~ దైవదర్శనం చేయించే మెట్లు, ఎలా అయితే మెట్లు ఎక్కేటప్పుడు మానవదేహంలో అనుభవాలు జరుగుతాయో, ఈ "గురుబోధలనే మెట్లు ఎక్కటం అనగా ఆచరించటం" అప్పుడు కూడా ఎన్నో అనుభవాలు ~ దివ్యానుభవాలు కలుగుతాయి. ఈ అనుభవాలు దేహ అనుభవాల వలె నొప్పులు కలిగించేవికావు.

ఈ అనుభవాలు మనసుకి ఆహ్లాదాన్ని, హృదయానికి ఆనందాన్ని, ఆత్మ స్వరూపానికి "సచ్చిదానందాన్ని" కలుగచేస్తాయి. ఈ ఆనందం- దివ్యానందం. అది కేవలం మిమ్మల్నే కాక వినే, చదివే వారిలో కూడా ఓ రకమైన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే "అనుభవమే జ్ఞానం కనుక". ఆ జ్ఞానమే మానవ జీవితంలోని చీకట్లని పారద్రోల గలిగే దివ్యాయుధం కనుక. పంచుకొనే కొలదీ పెరిగే ఈ' జ్ఞాన సంపదని' ~ మీ దివ్యానుభవాలని మీరు ఇతరులతో పంచుకుంటే మీవంతుగా మీరు 'పరుల హృదయంలో జ్ఞాన జ్యోతులు' వెలిగిస్తున్నట్లే.

దత్త భక్తులు, శ్రీ స్వామీజీ వారి శిష్యులు, లేదా "జాతి , మత, కులాలకు" అతీతంగా "అంతా ~ మనం అంతా ~ అన్నీ ఒక్కటే" అన్న దివ్య అవగాహనలో ఉండే ఆద్యాత్మిక పరులు ఎవరయినా సరే, మానవ శ్రేయస్సు నిమిత్తమై ఎన్నో రకాల పనులను చేపట్టే "విశ్వ కళ్యాణ కర్త"లు ఎవరయినా సరే "శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ" వారు అందించిన ఈ "శతశ్లోకి రామాయణం" "హనుమమంత్రం" విడియోలని దర్శించేటప్పుడు, శ్రవణం చేసేటప్పుడు, లేదా స్మరించేటప్పుడు ~ మీకు కలిగే 'దివ్యానుభవాలని ఇక్కడ తెలియచేయాలనుకుంటే @ Contact page ~ మీరు మీ పూర్తి వివరాలతో తెలియచేయగలరు.

*దివ్యానుభవాలని పంచుకోవటం ఓ సుకర్మ . సుకర్మ చేయును మీ జీవితాలను శుభకరం *

జై గురుదత్త  

శ్రీ గురుదత్త