దయాసాగరులు, కరుణార్ధ్ర హృదయులు అయిన శ్రీగణపతి సచ్చిదానందుల వారు "మానవాళిని" రక్షించుటకై ఓం నమో హనుమతే నమః అను "కార్యసిద్ధిహనుమ" మంత్రమును మనకు అందించినారు.

ఈ కార్యసిద్ధి హనుమ మంత్రం ~ ఓ 'అమృతగుళిక'. ఇది రక్షణ శాంతి నిమిత్తమై ప్రసాదింపబడిన సద్గురుదేవుని 'వరం' దీనిని కూడా శ్రీ స్వామీజీ వారు 2 నిముషాల వీడియోగా నవరాత్రి పర్వదినాన అందించినారు, వారి కృపకు తార్కాణముగా.

రాముని ప్రాణమైన 'హనుమ' ని తలచినచాలు తొలగును సర్వభయాలు. రామదూత అయిన శ్రీ హనుమ మంత్రాన్ని చూసిన, వినిన, స్మరించిన, వ్రాసిన చాలు "తొలగిపోవును సర్వవిధములైన ఉపద్రవాలు".

గురుకృపని పొందగోరువారు, గురురక్షణ, ఆశీర్వాదంతో జీవించాలనుకున్నవారు, శ్రీ స్వామీజీ వారు ఎంతో ప్రేమగా వారి 'శక్తి పాతము' రూపంలో మనకు అందించిన ఈ 2 నిమిషముల 'కార్యసిద్ధిహనుమ' మంత్రమును ప్రతినిత్యము క్రమం తప్పకుండా భక్తి, శ్రద్ధలతో, అపారవిశ్వాసంతో తిలకించిన చాలు, ఆలకించిన చాలు, స్మరియించిన చాలు, లిఖియించినా చాలు. అలాగే ఇతరులకి దీనిని అందించిన చాలు- మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్ననూ, సదా మీరు "సద్గురు దేవుల హృదయంలో కొలువై ఉంటారు, వారి హృదయ బోధనలని స్వీకరించగలుగుతారు.

మరి ఎందుకిక ఆలస్యం?

శ్రీ స్వామీజీ వారిపై మీకు ఉన్న భక్తి, శ్రద్దలను విశ్వాసాన్ని చూపించగలిగే అవకాశాన్ని ఈ "హనుమమంత్రం" అనే రూపంలో 'సద్వినియోగం' చేసుకోండి. (మరల అది కూడా మీ మేలుకే అని గుర్తుంచుకోండి)

*చివరగా ~ మనమంతా ఈ "విశ్వంలో ఒక భాగం" "విశ్వశాంతి స్థాపనయే విశ్వకళ్యాణం" మరి ఆ 'విశ్వకళ్యాణం' లో మనవంతు భాగం అయిన ఈ 'హనుమ మంత్రాన్ని' నిత్యం ఓ "దివ్యయజ్ఞం" గా భావించి దాన్ని పాటిద్దాం... తద్వారా మనం తరిస్తూ~ అందరినీ తరియింపచేద్దాం. ఆవిధంగా సద్గురుదేవుని ఆశీస్సులను సదా మెండుగా పొందుదాం.*

పూజ్యసద్గురుదేవుని పాదములకు ప్రణమిల్లుతూ...

*ఓం నమో హనుమతే నమః*