* ఈ సృష్టి అంతా 'నాదమయం' ~ ఆ నాదానికి మరో రూపే శ్రీ గణపతి సచ్చిదానందుల వారు.*

ఈ సృష్టి అంతా 'ప్రేమమయం' ~ ఆ ప్రేమకు ప్రతిరూపం శ్రీ స్వామీజీ వారు;

ఈ సృష్టి అంతా 'శక్తిమయం' ~ ఆ శక్తికి నిలువెత్తు దర్పణమే శ్రీ స్వామీజీ వారు;

ఈ సృష్టి అంతా 'కాంతిమయం' ~ ఆ నిరాకార వెలుగుయే ఈ సాకార గురుస్వరూపం;

ఈ సృష్టి అంతా 'చైతన్యమయం' ~ విశ్వానికి మూలం అయిన చైతన్య కదలికే శ్రీ స్వామీజీ వారు;

మరి అటువంటి దివ్య స్వరూపులయిన ~~ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందుల వారు "ద్వంద్వాలకు నిలయమయిన ఈ జగత్తులో"సృష్టి అణువు అణువునా నిండి ఉన్న దైవత్వాన్ని గుర్తించలేనంతగా అజ్ఞాన అంధకారములో 'నిలువెత్తుమాయలో' పడి కొట్టుకుపోతున్న మనుజుల కొరకు, నిత్యం అనేక రకాల బాధా పీడితులై నలిగిపోతున్న వారికొరకు మనిషి జీవితంలో ఇన్ని బాధలకు కష్టాలకు అతని దుఃఖానికి మూలమైన "అజ్ఞానం" ని పోగొట్టి "జ్ఞానాన్ని" ప్రసాదించుటకొరకై తనని తాను తన బిడ్డల కొరకై 'దత్తం' చేసుకున్న "విశ్వప్రేమ" శక్తి,నాద, కాంతి, చైతన్య,కరుణా స్వరూపులే ~~~ శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందస్వామీజీ వారు 'గురువు' ని గురించి వివరించుటకు వేదములు కూడా చాలవు అన్నప్పుడు~ఆ 'గురువు' ని గురించి ఆ 'గురుతత్వం' గురించి వ్రాయుట ఎవరితరమూ కాదు - మరి ఈ పైన వివరించినదంతా 'ఎవరు' అని అడిగితే సవినయముగా నే చెప్పేది ఒకటే... అది కూడా శ్రీ స్వామీజీ వారు రచించిన ఓ "భజన" లో నుంచే ---

*నాలో ఉన్నది శివుడేగా ~ నీలో ఉన్నది శివుడేగా ~ నీలో, నాలో అందరిలో ఉన్నది ఒకటే శివుడేగా*

అని సెలవిచ్చినటుల "అఖండమండలాకారం ~ వ్యాప్తంయేన చరాచరం" అయిన ఆ గురుస్వరూపుని గురించి వ్రాయగలిగినది కూడా "నాలో కొలువై ఉన్న ఆ శివమే"

ఈ 'శతశ్లోకి రామాయణం' అనే ఈ website ని చేయాలనే 'దివ్యభావన' ని నాలో కలుగచేసి నా ద్వారా శ్రీకారం చుట్టి ఈ మహత్కార్యాన్ని పూర్తిచేయించిన "గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరః" అయిన సద్గురు దేవులు పరమపూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందుల వారికి ఈ website ని 'ఆత్మ సమర్పణ' చేసుకుంటూ

దత్తం దత్తం శ్రీ దత్తం - శ్రీ గురుదత్తం భజదత్తం

*బ్రతుకులోన తారసిల్లి భక్తిపెంచు పాదము
ఇంటింటికి తిరిగి తిరిగి హితవు పంచు పాదము
ఇదిగిదిగో నా ఎదలో దాగె దత్తపాదము*

ప్రణతులతో

శాంతిశ్రీ